సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (12:05 IST)

సూర్య, జ్యోతిక ఏం వర్కౌట్స్ చేస్తున్నారబ్బా.. వీడియో వైరల్

Surya_Jyothika
Surya_Jyothika
దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరు సూర్య. ఈ స్మార్ట్ హీరో 40వ ఏట కూడా అందంతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తాడు. సూర్య ఫిట్ అవతార్ కావడానికి కీలకమైనది రోజువారీ వ్యాయామాలలో పాల్గొనడం. తాజాగా ఆయన భార్య జ్యోతిక కూడా తన భర్తలాగే ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సెలబ్రిటీ జంట తమ వ్యాయామ దినచర్యను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వర్కౌట్ వీడియోలుగా పంచుకున్నారు. 
 
వరుస సినీ ఆఫర్లతో బిజీ అవుతున్న జ్యోతిక తన భర్తతో కలిసి తన జిమ్ సెషన్‌ను తన అభిమానులతో పంచుకుంది. ఈ వర్కౌట్ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సూర్య తదుపరి మెగా చిత్రం కంగువలో కనిపించనున్నాడు.