విడిపోవడం దురదృష్టకరమైనా తప్పదు: సుశాంత్ అంకితతో కటీఫ్!!
బుల్లితెర నటి అంకిత లోఖాండేతో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ లవ్వాయణానికి బ్రేకిచ్చాడు. అంకితతో విడిపోతున్నట్లు సుశాంత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. 'ఆమె ఆల్కహాలిక్ కాదు, నేను ఉమనైజర్‌నీ కాదు. విడిపోవడం అనేది సాధారణమే.. దురదృష్టకరమైనా తప్పదంటూ సుమంత్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం కృతిసనన్‌కి జంటగా రాబ్తా సినిమాలో నటిస్తున్నాడు.
డిసెంబరులో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మొన్నామధ్య ఓసారి సుశాంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఉన్నట్టుండి.. ఇద్దరూ విడిపోయినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తల్ని నిజం చేస్తున్నట్లు సుశాంత్ ట్విట్టర్ ద్వారా అంకితకు దూరమవుతున్నట్లు ట్వీట్ చేశాడు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్-అంకిత లోఖండే 2009లో పవిత్ర రిష్ట సీరియల్ సమయంలో కలిశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత రాజ్ పుత్‌కు బాలీవుడ్ ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో అభిషేక్ కపూర్ కయ్ పొచె, ఛేతన్ భాగత్ నవల ఆధారంగా తెరకెక్కిన 2 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ చిత్రంలో సుశాంత్ నటించాడు. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్‌లో నటిస్తున్నట్లు తెలిసింది.