శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 26 సెప్టెంబరు 2016 (22:22 IST)

'అభినేత్రి' తమన్నా డ్యాన్సును నాని ఎందుకు చూడకూడదనుకున్నాడు...?

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎ.ఎల్. విజ‌య్ తెర‌కెక్కించిన విభిన్న క‌థాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, బ్లూ స‌ర్కిల్ కార్పోరేష‌న్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ఈ భారీ చిత్రం తెలుగు, త‌మిళ్, హిం

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎ.ఎల్. విజ‌య్ తెర‌కెక్కించిన విభిన్న క‌థాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, బ్లూ స‌ర్కిల్ కార్పోరేష‌న్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ఈ భారీ చిత్రం తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందింది. దాదాపు 70 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో అభినేత్రి చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి హాజ‌రైన కొర‌టాల శివ‌ అభినేత్రి బిగ్ సీడీను ఆవిష్క‌రించగా, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఆడియో సీడీను ఆవిష్క‌రించారు. ఇక థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ రిలీజ్ చేసారు.
 
హీరో నాని మాట్లాడుతూ... త‌మ‌న్నా డ్యాన్స్ చూసిన త‌ర్వాత నేను అలా డ్యాన్స్ చేయ‌లేను అనిపించింది. అందుక‌నే త‌మ‌న్నా డ్యాన్స్ చేసిన వీడియో చూడకూడ‌దు అనుకున్నాను కానీ... ఆ వీడియోను నేనే రిలీజ్ చేయాల్సి వ‌చ్చింది. ప్ర‌భుదేవాకి బిగ్ ఫ్యాన్‌ని. చికుబుకు రైలే పాట అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్పుడు ఆ పాట‌కు డ్యాన్స్ చేయాలని ప్రాక్టీస్ చేసేవాడిని. డైరెక్ట‌ర్ విజ‌య్ సినిమాలు అంటే చాలా ఇష్టం. త‌మిళ్‌లో ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా విజ‌య్ మంచి డైరెక్ట‌ర్ క‌న్నా మంచి మ‌నిషి అని విన్నాను. అలాంటి మంచి మ‌నిషికి స‌క్సెస్ రావాలి అన్నారు.
 
ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.... ట్రైల‌ర్ చూసాకా అభినేత్రి ఏ త‌ర‌హా సినిమా అనే ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో కొన్ని పాట‌లు విన్నాను చాలా బాగున్నాయి. విజ‌య్ సినిమాల‌కు అలాగే ప్ర‌భుదేవాకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ మూవీ బ్లాక్‌బ‌ష్ట‌ర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
 
త‌మ‌న్నా మాట్లాడుతూ... ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు చాలామంది గెస్ట్‌లు వ‌చ్చి మా ఆడియో వేడుక‌ను స్పెష‌ల్ ఈవెంట్‌గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ అందించిన‌ బాలీవుడ్‌లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాజిద్‌కి వెల్‌క‌మ్ చెబుతున్నాను.  ప్ర‌భుదేవా అంటే నాకు ఎంత అభిమాన‌మో మాట‌ల్లో చెప్ప‌లేను. ఇక నుంచి ప్ర‌భుదేవాని గురువుగా భావించి డ్యాన్స్ చేస్తాను. ఈ మూవీలో కామెడీ చాలా బాగుంటుంది. అలాగే ఈ చిత్రంలో సోనూ చాలా అందంగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత సోనూని బొమ్మాలి అని పిల‌వ‌డం మ‌ర‌చిపోయి హీరోలా చూస్తారు. ఈ సినిమాలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ స్టార్ట్ అయిన‌ప్పుడు నా ఫ‌స్ట్ ఫిల్మ్ స్టోరీ కోన‌నే చెప్పారు. ఈ సినిమాతో కోన‌కు మంచి డ‌బ్బులు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
 
ప్ర‌భుదేవా మాట్లాడుతూ... ఈ మూవీకి గ‌ణేష్ సార్ ఓ పిల్ల‌ర్ అయితే మ‌రో పిల్ల‌ర్ కోన వెంక‌ట్ గారు. ఈ చిత్రంలో న‌టించిన ఆర్టిస్ట్‌లు కంటే ఎక్కువమంది ఈ మూవీకి నిర్మాత‌లు. మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ సాజిద్ వాజిద్‌కి స్వాగ‌తం చెబుతున్నాను. అలాగే విశాల్ మ‌రింత‌గా రాణించాల‌ని కోరుకుంటున్నాను. సోనూసూద్ నాకు బ్ర‌ద‌ర్ లాంటివాడు. 25 ఏళ్ల పాటు సోనూతో జ‌ర్నీ చేయాల‌నుకుంటున్నాను. త‌మ‌న్నా మంచి న‌టి క‌న్నా ఒక అద్భుత‌మైన మ‌నిషి. డైరెక్ట‌ర్ విజ‌య్‌కి చాలా ఓపిక ఎక్కువ‌. సెట్లో చిన్న టెక్నీషియ‌న్స్‌కి సైతం ఎంతో ఓపిక‌గా చెబుతుంటారు. ఈ చిత్రానికి వ‌ర్క్ చేసిన గీత ర‌చ‌యిత‌లంద‌రూ మంచి పాట‌లు అందించారు అన్నారు.