సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 జూన్ 2016 (12:10 IST)

బాహుబలి 2 క్లైమాక్స్ షూటింగ్.. అవంతిక హార్స్ రైడింగ్.. ప్రభాస్, రానా, అనుష్క వర్కౌట్స్!?

భారత సినిమా చరిత్రలో రికార్డు సృష్టించిన బాహుబలి 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో రాజమౌళి బిజీ బిజీగా కనిపిస్తున్నారు. అంతేగాకుండా సినిమా యూనిట్‌ రాత్రనక, పగలనక కష్టపడతున్నారు. సెకండ్ పార్ట్ కోసం సెట్స్ తయారు చేసే పనిలో ప్రస్తుతం రాజమౌళి టీమ్ ఉంది. సెట్స్ కోసం రాజమౌళి ఇప్పటికే సాంకేతిక బృందంతో చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల టాక్.  
 
బాహబలి ది బిగినింగ్ తరహాలో భారీ విగ్రహ నిర్మాణం కోసం స్కెచ్‌లు వేస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌లో భల్లాలదేవ విగ్రహాన్ని చూపించారు. అయితే ఆ విగ్రహాన్ని కూలగొట్టి మరో స్టాచ్యూ ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఈసారి బాహుబలి ప్రభాస్ విగ్రహాన్ని చూపిస్తారని తెలిసింది. బాహుబలి 2 కోసం సెట్టింగ్స్ పని ఓ వైపు జరుగుతుంటే మరోవైపు తమ పాత్రల కోసం ప్రభాస్, అనుష్క, రానా రిహార్సల్స్, వర్కౌట్స్ చేస్తున్నారు. 
 
ఈ మూవీకోసం తమన్నా హార్స్ రైడింగ్, కత్తి యుద్ధంలో శిక్షణ పొందుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో 70 రోజులు జరుగనుందని సినీ యూనిట్ ద్వారా తెలుస్తోంది. భారత సినీ చరిత్రలో బాహుబలి 2 సినిమా క్లైమాక్స్ షూటింగ్ కూడా రికార్డు సృష్టిస్తుందని సినీ పండితులు అంటున్నారు.