శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (14:10 IST)

మిల్కీ బ్యూటీని కాటేసిన కరోనా సూక్ష్మజీవి?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను కరోనా వైరస్ కాటేసింది. ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ప్ర‌స్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. 
 
కొన్ని రోజుల క్రితం త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా సోకింది. అయితే, అప్పట్లో ఆమె కూడా పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. తాజాగా, ఆమె జ్వరంతో బాధపడుతుండడంతో వైద్యులు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో కొవిడ్‌-19 నిర్ధారణ అయింది.
 
త‌మ‌న్నా త‌ల్లిదండ్రులు ఇప్పటికే  క‌రోనా నుండి కోలుకున్నారు. ఓ సినిమా షూటింగ్‌ కోసం ఇటీవల తమన్నా హైదరాబాద్‌కు వచ్చింది.  ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. కాగా, సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.