మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 17 జులై 2021 (17:42 IST)

నాటక రంగ సంస్థ వెండితెర‌పైకి వ‌స్తోంది

Nanduri Srinu, Nanduri Ramu, Ajay Ghosh
యన్.వి.ఎల్ ఆర్ట్స్ యన్.వి.ఎల్ అంటే అలనాటి ఆంద్ర నాటక రంగ స్థలంలో ఒక బ్రాండ్. హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలకు పెట్టింది పేరు. కీ. శే. శ్రీమాన్ యన్.వి.ఎల్ నరసింహచార్యులు. వారి పేరు మీద కుమారులు నండూరి శ్రీను, నండూరి రాము కలసి య.వి.ఎల్ ఆర్ట్స్ స్థాపించడమైనది. ఈ బేన‌ర్‌లో అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు(పలాస) ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతున్న‌ మొద‌టి సినిమా శ‌నివారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. 
 
ఈ చిత్రానికి మహేష్ బంటు  దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఆగస్ట్ 2వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం, హీరో , హీరోయిన్, ఇత‌ర నటీనటులు సాంకేతిక వర్గం వివ‌రాలు త్వరలో తెలియచేస్తామ‌ని ఈ సంస్థ సి.ఈ.ఓ రాజశేఖర్ ఆణింగి తెలియజేశారు.
 
మూలకథ : అజేయ్ ఘోష్ (సినీ నటుడు) 
నటీ నటులు:  అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస), నందూరి రాము, రంగధాం, సత్యదేవ్ తదితరులు.
సాంకేతిక వర్గం: రచన , దర్శకత్వం : మహేష్ బంటు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కరెడ్ల బాలాజీ శ్రీను, సహా నిర్మాత: దంతులూరి నరసింహమూర్తి రాజు, నిర్మాతలు- నండూరి శ్రీను , నండూరి రాము, డి.ఓ.పి - ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటర్ - బొంతల , నాగేశ్వర రెడ్డి.