సంబంధిత వార్తలు
- Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్
- Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్
- అడివి శేష్ డెకాయిట్ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
- Sesh Adavi: డెకాయిట్ చిచ్చుబుడ్డి ఫుల్ సాంగ్ లో మెరిసిన అడివి శేష్, జోనితా గాంధీ, పవన్ సింగ్
- Mrunal Thakur :అడివి శేష్ డెకాయిట్ లోని సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి రాబోతోంది
Venkatesh: ఐదు సినిమాలు చేస్తే చాలనుకున్న నన్ను నిలబెట్టింది వారే : అడివి శేష్
Venkatesh, Adivi Sesh, Siddhu Jonnalagadda, Mrunal Thakur, Sumanth, Supriya Yarlagadda
వెంకటేష్ మాట్లాడుతూ, ఈవెంట్ కు అందరూ నేను సుప్రియ కోసం వచ్చాను అనుకుంటున్నారు. కానీ నేను సురేంద్ర మావయ్య కోసం వచ్చాను. నా ఫేవరెట్ మావయ్య. ఎస్ ఎస్ క్రియేషన్స్ లో సుప్రియ ఇంత అద్భుతమైన సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని సినిమాలు మొదలైనప్పుడే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. సుప్రియ చాలా మంచి సినిమా తీస్తుందనే వైబ్ ఉండేది. ఎందుకంటే చాలా పాషన్ ఉన్న టీం తో చేశారు. అందరూ మంచి సినిమా తీయాలి, ప్రేక్షకుల ముందుకు రావాలి,పెద్ద హిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేశారు. శేష్ ని పంజాలో చూశాను. అప్పుడే తను చాలా అద్భుతమైన నటుడు అవుతాడు అనిపించింది. తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ హిట్స్ అయ్యాయి. మరిన్ని బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను.
డెకాయిట్ కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో డౌట్ లేదు. ఇది మృణాల్ బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చూడగానే ఇది కచ్చితంగా విజయవంతమైన సినిమా అవుతుందని అనిపించింది. ఒక లవ్ స్టోరీ లో ఇలాంటి యాక్షన్ ఉండటం చాలా కొత్తగా ఉంది. ఇంత కొత్త సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సుప్రియ ఇంత అద్భుతమైన సినిమాతో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎస్ ఎస్ క్రియేషన్స్ మరిన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ, ప్రాణం పెట్టి చేశాను. చాలా గ్రేట్ ఫుల్ గా అనిపించింది. మనం కోరుకున్న ఒక డ్రీమ్ ని నెరవేర్చాలని ఇంతమంది అహర్నిశలు కష్టపడ్డారు. మా డైరెక్టర్ శానిల్ ఇప్పటికీ ఆరు రాత్రులు పడుకోకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంకో గంటలో ఓవర్సీస్ పంపించాలి. ఇద్దరం కలిసి కన్న ఒక డ్రీమ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి తను ఇక్కడ లేకుండా వర్క్ లో ఉన్నాడు. ఈ సినిమా సుప్రియ గారి సపోర్ట్ మీద నిలబడింది.
ఐదు సినిమాలు చేస్తే చాలు అనుకునే నేను ఈరోజు ఇలా మీ ముందు ఉండడం.. ప్రేక్షకుల అభిమానం. వెంకటేష్ గారికి సిద్ధూ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పవన్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం అందరూ ప్రేమతో పని చేశారు. నా నుంచి సక్సెస్ లు చూశారు అంతకుముందు ఫెయిల్యూర్ లు కూడా చూశారు. కానీ ఈ సినిమాలో మేము సినిమాని ఎంత ప్రేమించామో చూస్తారు. ఈ రెండేళ్ల జర్నీలో మాతో పాటు నడిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మృణాల్ క్యారెక్టర్ ఇంటర్వ్యూలో పిచ్చెక్కిస్తుంది. ఇంటర్వెల్ లో తనే హైలెట్. ఇంటర్వెల్ అలా రావడానికి కారణం సుజిత్. మేము ఒరిజినల్ గా ఒక ప్రేమ కథ అనుకున్నాం. కానీ ఈ రెండేళ్ల జర్నీలో అందరూ కూడా ఎంతో ప్రేమని అందించారు. ఏప్రిల్ 10 మీరందరూ కూడా ఒక హానెస్ట్ సినిమాను చూస్తారు. మా పాషన్ ని చూస్తారు. అందరికీ థాంక్యూ సో మచ్.
ఇంకా సిద్దు జొన్నలగడ్డ, మృణాల్ ఠాగూర్, సుమంత్, సుప్రియ యార్లగడ్డ, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, ప్రొడ్యూసర్ రవిశంకర్, నాగ వంశీ తదితరులు మాట్లాడారు.
తర్వాతి కథనం
