నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో సైలెంటుగా బాక్సాఫీసును బద్ధలు చేస్తున్న టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. విషాదంలో కూడా సంతోషంగా ఎలా వుండాలో అనిల్ రావిపూడి చూపించే కామెడీని చూస్తే తెలుస్తుందని అంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి లవ్ లైఫ్ కాస్తంత గతుకుల్లో నుంచి వచ్చిందట. తను ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడట. ఆమె కూడా అనిల్ రావిపూడిని ప్రేమించిందట.
ఐతే హఠాత్తుగా అనిల్ రావిపూడికి హ్యాండిచ్చి మరో యువకుడిని పెళ్లాడి వెళ్లిపోయిందట. దీనితో పాపం అనిల్ రావిపూడి ప్రేయసి చేసిన మోసానికి కుంగిపోయాడట. ఆ సమయంలో తన ప్రేయసి ఫ్రెండ్ భార్గవి అనే అమ్మాయి వచ్చి ఓదార్చిందట. అంతేకాదు... అనిల్ రావిపూడితో... నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేసిందట. దాంతో అనిల్ రావిపూడి తన గత లవ్ లైఫ్ విషాదాన్ని వదిలేసి సంతోషంతో భార్గవిని పెళ్లి చేసుకున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది అంటూ కామెడీ పంచ్ కొట్టాడు. ఏమైనా అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ అదుర్స్ కదూ.