1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Trisha Krishnan conferred with UNICEF celebrity status

చెన్నై చిన్నదానికి అరుదైన పురస్కారం

చెన్నై చిన్నది త్రిషకు అరుదైన పురస్కారం వరించింది. ప్రతిష్టాత్మక యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ హాదాకు ఎంపికైంది. దీంతో పిల్లలు, యువత హక్కులను కాపాడేందుకు నిర్వహించే కార్యక్రమాల్లో త్రిష భాగస్వామ్యమవుతార

Trisha Krishnan
చెన్నై చిన్నది త్రిషకు అరుదైన పురస్కారం వరించింది. ప్రతిష్టాత్మక యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ హాదాకు ఎంపికైంది. దీంతో పిల్లలు, యువత హక్కులను కాపాడేందుకు నిర్వహించే కార్యక్రమాల్లో త్రిష భాగస్వామ్యమవుతారని యునిసెఫ్ వెల్లడించింది.
 
దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో చిన్నపిల్లల్లో ఎనీమియా, బాల్యవివాహాలు, బాలకార్మికులు, చిన్నారులపై వేధింపులు వంటి అంశాల్లో త్రిష తన మద్దతును అందించనుంది.
 
కౌమార దశలో ఉన్న పిల్లలు, యువతకు త్రిష ఐకాన్‌లాంటి వారని, కుటుంబం, బహిరంగ ప్రదేశాలు, కులాల్లో పిల్లలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే అధికారం ఆమెకు ఉంటుందని కేరళ, తమిళనాడు యునిసెఫ్ చీఫ్ జాబ్ జకారియా వెల్లడించారు. 
 
వీటితోపాటు చిన్నపిల్లలకు చదువు ఆవశ్యకతను తెలియజెప్పడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, సమాజంలో ఆడపిల్లల ప్రాముఖ్యత వంటి అంశాలను త్రిష ప్రమోట్ చేస్తారని ఆయన తెలిపారు. దీనిపై త్రిష కూడా సంతోషం వ్యక్తంచేశారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నంది అవార్డులపై చిరు స్పందించిన తీరు చూస్తే షాకే..