శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (14:28 IST)

సుచీ లీక్స్‌పై త్రిష స్పందన... వారంతట వారే నాశనమై పోతారు... అదృష్టం ఉంటే మీ కళ్లతో చూస్తారు

తమిళ గాయని సుచిత్రా కార్తీక్ తన ట్విట్టర్ ఖాతాలో లీక్ చేసిన ప్రైవేట్ ఫోటోలపై నటి త్రిష తనదైనశైలిలో స్పందించింది. కర్మ సిద్ధాంతాన్ని కోట్ చేస్తూ పరోక్షంగా సుచీ లీక్స్‌పై ఆమె ఘాటుగా స్పందించారు. సింగర్

తమిళ గాయని సుచిత్రా కార్తీక్ తన ట్విట్టర్ ఖాతాలో లీక్ చేసిన ప్రైవేట్ ఫోటోలపై నటి త్రిష తనదైనశైలిలో స్పందించింది. కర్మ సిద్ధాంతాన్ని కోట్ చేస్తూ పరోక్షంగా సుచీ లీక్స్‌పై ఆమె ఘాటుగా స్పందించారు. సింగర్ సుచిత్రా ఉన్నట్టుండి ధనుష్‌, రానాలతో త్రిష కిస్సింగ్‌ ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. త్రిషతోపాటు ఇతర హీరోహీరోయిన్ల ఫొటోలు, వీడియోలు కూడా సుచీలీక్స్‌ కారణంగా బయటకు వచ్చాయి.
 
వీటిపై త్రిష స్పందిస్తూ... ‘కర్మ’ గురించి కోట్‌ చేస్తూ కామెంట్స్ చేసింది. ‘పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కూర్చుని విశ్రాంతిగా చూస్తూ ఉండండి. మిమ్మల్ని బాధపెట్టిన వారు.. వారంతట వారే నాశనమైపోతారు. మీకు అదృష్టం ఉంటే.. వాళ్ల నాశనాన్ని మీ కళ్లతో చూసే అవకాశం దేవుడు మీకు ఇస్తాడు’ అంటూ చాలా ఘాటుగా స్పందించింది త్రిష. సుచీ లీక్స్‌పై త్రిష ఎంత కోపంగా ఉందో ఈ పోస్ట్‌ చదివితే అర్థమైపోతోంది కదూ.