శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 15 మే 2017 (14:56 IST)

'బాహుబలి-2' సినీమేనియా... కుమార్తెకు ఆ పేరు పెట్టిన బాలీవుడ్ హీరో భార్య

సినీ అభిమానుల సంగతి అటుంచితే... చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇప్పటికీ బాహుబలి మేనియా నుంచి బయటపడలేక పోతున్నారు. ఈ చిత్రాన్ని ఒకటికి మూడుసార్లు తిలకిస్తూ... ట్వీట్లపై ట్వీట్లు చేస్తున్నారు.

సినీ అభిమానుల సంగతి అటుంచితే... చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇప్పటికీ బాహుబలి మేనియా నుంచి బయటపడలేక పోతున్నారు. ఈ చిత్రాన్ని ఒకటికి మూడుసార్లు తిలకిస్తూ... ట్వీట్లపై ట్వీట్లు చేస్తున్నారు. 
 
ఇటీవల ‘బాహుబలి-2’ చూసిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా... కట్టప్ప పాత్రకు ఫిదా అయిపోయిందట. సినిమా చూసిన దగ్గర్నుంచి తన నాలుగేళ్ల కుమార్తెను కట్టప్ప అనే పిలుచుకుంటోందట. ఈ విషయం స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. 
 
‘‘బాహుబలి సినిమా చూశాను. అప్పట్నుంచి నా కూతుర్ని కట్టప్ప అనే పిలుచుకుంటున్నా. ఇది ఆమె తండ్రి (అక్షయ్)ని కొంచెం బాధపెడుతుందేమో.. ఎందుకంటే ఆయన తన కూతుర్ని ‘రౌడీ’ అని పిలిచేందుకే ఇష్టపడతారనుకుంటా..!’’ అని ట్వీట్ చేసింది. కట్టప్ప అని మూడు సార్లు పలికితే.. ఇక ఆ పేరును పలక్కుండా ఆపడం సాధ్యం కాదని అందులో పేర్కొంది.