1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Varalaxmi Sarathkumar tests positive for Covid-19

కరోనా బారిన పడిన వరలక్ష్మీ శరత్ కుమార్ (video)

varalakshmi
varalakshmi
ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా కరోనా బారిన పడింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను షేర్‌ చేసింది. అందులో తనకు కరోనా సోకిన విషయంతోపాటు, సినిమా సెట్స్‌లో పరిస్థితుల గురించి కూడా ప్రస్తావించింది. 
 
''అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్‌ - 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల నన్ను కలిసినవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోండి'' అని వరు సూచించింద. దాంతోపాటు '' సినిమా షూటింగ్స్‌ సెట్‌లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించేలా చూడాలి. నటీనటులు అన్నిసార్లు సెట్‌లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్లైనా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెట్‌లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా పట్టుబట్టాలి'' వరలక్ష్మి కోరింది. 
 
కరోనా వచ్చిందని చెబుతూనే.. సెట్స్‌లో పరిస్థితులపై వరలక్ష్మి వివరాలు చెప్పిన ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్లు గెట్‌ వెల్‌ సూన్‌ అని స్పందిస్తున్నారు. 
 
మరోవైపు ఆమె పిన్ని రాధిక కూడా రియాక్ట్‌ అయ్యారు. ''జాగ్రత్త వరూ.. నీకు మరింత ధైర్యం, బలం చేకూరాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను'' అంటూ కామెంట్‌ చేశారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ప్రేక్షకుల స్పందన నిజాయితీగా ఉంటుంది - నవీన్ చంద్ర