సోమవారం, 4 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు కరోనా పాజిటివ్

Varalaxmi Sarathkumar
సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు కరోనా వైరస్ సోకిది. ఈ విషయాన్ని ఆమె ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. 
 
కొవిడ్‌ ఇంకా మనల్ని వదిలిపోలేదని.. దయచేసి అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరుతూ ఆమె ఓ వీడియో రిలీజ్‌ చేశారు. 'అన్నిరకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. 
 
అలాగే, సెట్‌లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా పట్టుబట్టాలి. ఎందుకంటే నటీనటులు అన్నిసార్లు సెట్‌లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్నవాళ్లందరూ ఇకనైనా మాస్కులు ధరించేలా చూసుకోవాలి' అని వరలక్ష్మి పేర్కొన్నారు.