శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (11:17 IST)

హీరోయిన్ పవన్ ఫ్యాన్ అంటే నాకు నచ్చలేదు.. చిరు తర్వాతే పవన్: వరుణ్ తేజ్ (Juke box)

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. సాయి ప‌ల్ల‌వి తాజాగా న‌టిస్తున్న ఫిదా జూలై 21న విడుద‌ల‌కానుంది. ఈ మూవీకి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడు. ఈ ఫిదా చిత్రంలో వ‌రుణ్ అమెరికా అబ్బాయిగా, సాయి ప‌ల్ల‌వి తెలంగాణ అమ్మాయి ప

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. సాయి ప‌ల్ల‌వి తాజాగా న‌టిస్తున్న ఫిదా జూలై 21న విడుద‌ల‌కానుంది. ఈ మూవీకి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడు. ఈ ఫిదా చిత్రంలో వ‌రుణ్ అమెరికా అబ్బాయిగా, సాయి ప‌ల్ల‌వి తెలంగాణ అమ్మాయి పాత్ర పోషించింది. శ‌క్తి కాంత్ చిత్రానికి సంగీతం. దిల్ రాజు ఈ మూవీకి నిర్మాత‌. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ మూవీ సాంగ్స్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ మూవీలో మొత్తం ఆరు పాట‌లున్నాయి. 
 
సోమ‌వారం సాయంత్రం జ‌రిగిన "ఫిదా" ఆడియో రిలీజ్ వేడుక‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భావోద్వేగంతో మాట్లాడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరో కాక‌ముందే చిరంజీవి త‌న‌కు పెద‌నాన్న అని, త‌ను ఈ స్థాయికి రావ‌డానికి మొద‌టి ఆద‌ర్శం ఆయ‌నేన‌ని త‌ర్వాతే బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని హీరో వ‌రుణ్ తేజ్ అన్నారు. మెగా హీరోలు ఎవ‌రూ రాక‌పోయినా వారి అభిమానులు వ‌చ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 
 
మెగా ఫ్యాన్స్ తలెత్తుకునే సినిమాలు చేస్తానని వరుణ్ తేజ్ అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ, హీరోయిన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ అని చెప్ప‌గానే త‌నకు న‌చ్చ‌లేద‌ని, కానీ శేఖ‌ర్ క‌మ్ముల చెప్పిన మాట‌ల‌కు క‌న్విన్స్ అయ్యాన‌నన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైలాగులు చెబుతుంద‌ని, అవి అభిమానులకు బాగా న‌చ్చుతాయ‌ని వ‌రుణ్ తెలిపారు. అలాగే ఇది కుటుంబ‌స‌మేతంగా చూడాల్సిన ఫీల్ గుడ్ సినిమా అని వెల్లడించారు.