ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (21:07 IST)

నటి వీణా కపూర్ మృతి.. బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి కొడుకే చంపేశాడు..

తలకి గాయంతో అనుమానాస్పద మృతి అనుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి వీణా కపూర్ మరణం హత్యగా నిర్ధారించబడింది. ఆమె కన్న కొడుకునే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆస్తి వివాదాలతో కపూర్ కుమారుడు ఆమెను హత్య చేశాడని తేల్చారు. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించిన వీణా కపూర్‌ని బేస్‌బాల్ బ్యాట్‌తో దారుణంగా కొట్టి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 
 
ఆపై మృతదేహాన్ని నివాసానికి 90 కిలోమీటర్ల దూరంలో అడవిలో పారేసి పారిపోయాడని విచారణలో తేలింది. మహారాష్ట్ర ముంబైలోని పాష్ జుహూ ప్రాంతంలో జరిగిన ఈ హత్య బాలీవుడ్ టీవీ పరిశ్రమను కుదేపిసింది.  వీణా కపూర్ హత్యకు సంబంధించిన వివరాలను ఆమె సహ నటి నిలు కోహ్లీ తెలిపారు. 
 
74 ఏళ్ల నటి వీణా కపూర్‌తో కలిసి పలు టీవీ సీరియల్స్‌లో చాలా సంవత్సరాలు ఈమె పనిచేశారు. ఇక వీణా కపూర్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారని కోహ్లీ చెప్పారు.