1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (18:32 IST)

విద్యాబాలన్‌కు పాకిస్థాన్ నుంచి పిలుపు.. సినిమాల్లో నటించాలట..!

బాలీవుడ్ ముద్దుగుమ్మలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తుండగా, డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్‌కు పాకిస్థాన్ సినిమాల్లో నటించాలని పిలుపు వచ్చింది. ముంబై పేలుళ్ల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో క్రికెట్ కూడా ఆడని భారత్.. త్వరలో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టుతో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో విద్యాబాలన్‌కు పాకిస్థాన్ సినిమా ఆఫర్ రావడం హర్షనీయమని సినీ జనం అనుకుంటున్నారు. జాతీయ అవార్డు గ్రహీత విద్యాబాలన్‌కు రెండు పాకిస్థానీ సినిమా ఛాన్సులు వచ్చాయని ఆ దేశ మీడియా కోడైకూస్తోంది. 
 
మరోవైపు పాకిస్థాన్ సినీ ఆఫర్లపై విద్యాబాలన్ కూడా స్పందించింది. పాకిస్థానీ సినిమాల్లో నటించే ఛాన్సు రావడం నిజమేనని ధ్రువీకరించింది. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూశానని.. పాకిస్థాన్ ఫిల్మ్ బోల్ సినిమా చూశానని.. త్వరలో ఖమోష్ పానీ సినిమాను చూడననున్నట్లు తెలిపింది. ఈ రెండు సినిమాలు మంచి చిత్రాలని చెప్పింది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా కెరీర్ పరంగా వర్క్ చేసేందుకు రెడీ అని ప్రకటించింది. 
 
పనిలో పనిగా జిందగీ ఛానల్‌పై ప్రశంసలు కురిపించింది. ఆ ఛానల్ అంటే చాలా ఇష్టమని విద్యాబాలన్ చెప్పింది. ఈ హిందీ ఛానల్‌లో ప్రసారమయ్యే పాకిస్థాన్ డ్రామాలను చూస్తానని తెలిపింది. త్వరలో పాకిస్థాన్ సినిమాల్లో కనిపించనున్నట్లు ఆమె వెల్లడించింది. TE3N సినిమా ప్రమోషన్‌లో విద్యాబాలన్ బిజీ బిజీగా ఉంది.