1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 3 అక్టోబరు 2016 (18:36 IST)

ఇప్పటి జనరేషన్‌కు చిరంజీవి భయపడుతున్నారా..?

చిరంజీవి అంటే గొప్ప నటుడని ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పటి యూత్‌కు బాగా తెలుసు. తన కుమారుడు రామ్‌చరణ్‌ 'మగధీర' చేశాక.. వచ్చిన అప్లాజ్‌తో చిరంజీవి వుబ్బితబ్బిబయ్యారు కూడా. తన పేరు నిలబెట్టాడని... కోటి రూపాయలతో కారును కూడా కొని కొడ

చిరంజీవి అంటే గొప్ప నటుడని ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పటి యూత్‌కు బాగా తెలుసు. తన కుమారుడు రామ్‌చరణ్‌ 'మగధీర' చేశాక.. వచ్చిన అప్లాజ్‌తో చిరంజీవి వుబ్బితబ్బిబయ్యారు కూడా. తన పేరు నిలబెట్టాడని... కోటి రూపాయలతో కారును కూడా కొని కొడుక్కు బహుమతిగా ఇచ్చాడు. ఆ చిత్రంలోనే చిరంజీవి చిన్న పాత్ర వేశాడు. చిత్రం విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే.. ఆయన రాజకీయాల్లో బిజీగా వున్నాడు. అంతకుముందే రాజకీయాల్లోకి వెళ్ళాడు. 
 
అయితే.. రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు సినిమాల్లోకి రానని గట్టిగా చెప్పాడు. అప్పట్లో అది విన్నవారికి ఆశ్చర్యమేసినా.. పరిస్థితుల వల్ల ఆయన మళ్ళీ యూ టర్న్‌ తీసుకున్నారు. కాగా, చిరంజీవి పలు ఫంక్షన్లకు వెళ్ళితే.. అక్కడ యువతీయువకులు.. మీరు రామ్‌ చరన్‌ తండ్రిగారు కదా అని అడిగేవారట. అది చెప్పుకుని ఆయనే ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు మరలా హీరోగా నటిస్తున్నాడు. అందుకే ఈ జనరేషన్‌కు తాను ఇంకా బాగా దగ్గరవ్వాలంటే.. ఏమి చేయాలనే ఆలోచనలో 'మా' అవార్డ్సులో పాల్గొని.. ఇంకా తాను డాన్స్‌లు వేయగలనని నిరూపించుకున్నాడు.
 
అందులో భాగంగానే మాటీవీలో వచ్చే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌ను కూడా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెలాఖరులో ఎపిసోడ్ షూటింగ్‌ జరుగనుంది. డిసెంబర్‌ నుంచి టెలికాస్ట్‌ కానుంది. అప్పటినుంచి తన చిత్ర ప్రమోషన్‌ను కూడా స్పీడప్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే యంగ్‌ జనరేషన్‌.. చిరంజీవిని యాక్సెప్ట్‌ చేస్తారా? అనేది కూడా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. మెగాస్టార్‌గా ఒకప్పుడు వెలగవచ్చు. కానీ ఇప్పటి ట్రెండ్‌ను బట్టి.. నేచురల్‌ నటుల్నే యూత్‌ ఆదరిస్తున్నారు. మరి మెగాస్టార్‌ చేసే స్టయిల్స్‌.. మగధీరలో యాక్సెప్ట్‌ చేసినా... బ్రూస్‌లీ చిత్రంలో.. చిరంజీవి హెలికాప్టర్‌లో వచ్చే సీన్‌.. డ్రెమటిక్‌గా వుందనే విమర్శలు కూడా వచ్చాయి. 
 
ఆ చిత్రం కూడా పెద్ద ఆదరణకు నోచుకోలేదు. మెగాస్టార్‌ వున్నా ఆదరించలేదంటే.. తదుపరి చిత్రం ఎలా వుండాలి? దాన్ని ఎలా ప్రమోట్‌ చేయాలనేది వినాయక్‌ టీమ్‌తో చర్చలు జరిపి.. నాగార్జునతో మంతనాలు జరిపి.. బుల్లితెరపై వస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
ఇదిలావుండగా.. మెగాస్టార్‌ స్టామినా ఎప్పటికీ చెదరదు.. కానీ వ్యక్తిగతంగా రాజకీయాల్లో జీరో అయిన చిరంజీవిగానే యూత్‌కు బాగా తెలుసుననీ.. అది సినిమాలపై ప్రభావం చూపించే ప్రమాదముందని కథనాలు విన్పిస్తున్నాయి. ఏదైనా జిమ్మిక్కు చేసి.. తన నటనతో చిరంజీవి ఆకట్టుకుంటూనే ఖైదీ నెం.150 సినిమా గట్టెక్కదనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. ఎంత కీర్తిప్రతిష్టలున్నా.. అవి కొంతవరకేననీ.. ఎల్లకాలం వుండవనీ.. అది సినిమాకూ వర్తిస్తుందని అంటున్నారు. మరి సంక్రాంతి వచ్చే.. చిరంజీవిని ఎలా రిసీవ్‌ చేసుకొంటారోనని.. కించిత్‌ సందేహం కూడా ఆయనలో లేకపోలేదు. సంక్రాంతి రేసులో చిరు 150 ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాల్సిందే.