శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 మే 2017 (15:14 IST)

'బాహుబలి 3'పై రాజమౌళి తండ్రి ఏమన్నారో తెలుసా?

బాహుబలి 3 చిత్రంపై చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, బాహుహలి చిత్ర కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. నిజానికి దర్శకుడు రాజమౌళి నుంచి ‘మూడో’ పార్టును ఆశిస్తున్నారు. దీనిపై ఇటీవల రాజమౌళి స్పం

బాహుబలి 3 చిత్రంపై చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, బాహుహలి చిత్ర కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. నిజానికి దర్శకుడు రాజమౌళి నుంచి ‘మూడో’ పార్టును ఆశిస్తున్నారు. దీనిపై ఇటీవల రాజమౌళి స్పందించాడు. ‘ఉన్నది.. లేదు’ అని చెప్పకుండా ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేశాడు. 
 
కానీ, కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ... బాహుబలి సినిమా పూర్తైపోయిందని, మూడో పార్టు తీయడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. 'బాహుబలి-3' ఉండబోదని చెప్పారు. తాను, రాజమౌళి దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, దానికి కథంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు.
 
అయితే, బాహుబలి-3 సినిమా లేకపోయినా.. బాహుబలి రూపంలో వివిధ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయని అన్నారు. ఇప్పటికే బాహుబలి కామిక్ సిరీస్‌లున్నాయని, మరికొద్ది రోజుల్లోనే టీవీ సిరీస్ రాబోతోందని చెప్పారు. బాహుబలి సినిమాకు వేసిన సెట్టింగుల్లోనే వాటి షూటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.