మంగళవారం, 2 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (13:01 IST)

యూత్‌ ఫ‌స్ట్ ల‌వ్‌నైనా మ‌ర‌చిపోతారు కానీ ఫ‌స్ట్ బైక్‌ను మ‌ర‌చిపోరు : ఎస్.ఎస్.రాజమౌళి

SS Rajamouli, Sri Simha Koduri, Kavya Kalyan Ram, Nani and others
SS Rajamouli, Sri Simha Koduri, Kavya Kalyan Ram, Nani and others
హీరో శ్రీ సింహ కోడూరి  క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో కార్తీక్‌, సాయికిర‌ణ్‌, ర‌వి శివ‌తేజ‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ ప్రియాంక వీర‌బోయిన‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ అర‌వింద్ నూలే, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అకీవా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, నేచుర‌ల్ స్టార్ నాని విచ్చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ ‘‘అబ్బాయిలు వాళ్ల ఫ‌స్ట్ ల‌వ్‌నైనా మ‌ర‌చిపోతారు కానీ..ఫ‌స్ట్ బైక్‌ను మ‌ర‌చిపోరు. బైక్‌ను చూడ‌గానే రెక్క‌లు వ‌చ్చిన ఫీలింగ్ వ‌స్తుంది. అందుకే యూత్‌కు బైక్ న‌చ్చుతుంది. ఫ‌ణిదీప్ రాసుకున్న తీరు చ‌క్క‌గా ఉంది. అకీవా మ్యూజిక్ బావుంది. సాంగ్స్ నేను రోజూ వింటున్నాను. రూ. 30-35 కోట్లు సినిమాలాగా అనిపిస్తుంది. న‌టీన‌టుల‌తో పాటు టెక్నీషియ‌న్స్ చాలా బాగా చేశారు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ మ‌న ప‌క్కింటి అమ్మాయిలాగా ఉంది. సింహా క‌ష్ట‌మైన రూట్‌ను ఎంచుకున్నాడు. త‌ను ఈజీ రూట్‌ను ఎంచుకోవాల‌నుకోలేదు. త‌న‌ని నేను ద‌గ్గ‌ర నుంచి చూస్తున్నాను. సింహా మూడు షేడ్స్‌లో అద్భుతంగా న‌టించాడ‌ని అంద‌రూ అంటున్నారు. పెద్ద చెట్లు నెమ్మ‌దిగా ఎదుగుతాయి. అలాగే సింహా కూడా త‌న ల‌క్ష్యాన్ని సాధిస్తాడ‌ని అనుకుంటున్నాను. ఉస్తాద్ టీమ్‌కి అభినంద‌న‌లు’’ అన్నారు. 
 
నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘రాజ‌మౌళి అండ్ టీమ్ కొత్త పాత అని సంబంధం లేకుండా అంద‌రినీ ఎంక‌రేజ్ చేస్తుంటారు. నా సినిమాల విష‌యంలో వారెలా స్పందిస్తారోన‌ని ఆలోచిస్తుంటాను. వాళ్లు చెప్పే దాన్ని బ‌ట్టి డిసైడ్ అవుతుంటాను. సింహా విష‌యానికి వ‌స్తే త‌ను గ్రౌండ్ లెవ‌ల్లోనే ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీనే అలా ఉంటుంది. రాజ‌మౌళి ఫ్యామిలీలో అంద‌రూ టెక్నీషియ‌న్సే యాక్ట‌ర్స్ లేర‌ని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సింహా రూపంలో యాక్ట‌ర్ కూడా వ‌చ్చేస్తున్నాడు. త‌ను కూడా టాప్ పోజిష‌న్‌లో నిలుస్తాడు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ మంచి కంటెంట్‌ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వ‌స్తుంది. మ‌న అని అనుకునే హీరోయిన్స్‌లో త‌ను కూడా నిలుస్తుంది. ఉస్తాద్ అనే పేరులోనే ప‌వ‌ర్ ఉంది. ట్రైల‌ర్‌లో ఎన‌ర్జీ ఉంది. ఉస్తాద్ పాజిటివ్ వైబ్స్‌తో ఆగ‌స్ట్ 12న రిలీజ్ అవుతుంది. శ్రీసింహా కెరీర్‌లో ఉస్తాద్ మెమొర‌బుల్ మూవీ అవుతుందని న‌మ్ముతున్నాను’’ అన్నారు.
 
డైరెక్ట‌ర్ ఫ‌ణిదీప్ మాట్లాడుతూ,  ఉస్తాద్ అనేది పెట్టే పేరు కాదు. సంపాదించే పేరు. మ‌న చుట్టూ కూడా చాలా మంది ఉస్తాద్‌లుంటారు.  అనేది క‌ల‌ల‌ను నిజం చేసుకునే ఓ యువ‌కుడి క‌థే ఇది. సింహాను కోవిడ్ స‌మ‌యంలో క‌లిశాను. నెరేష‌న్ విన‌గానే త‌ను చెప్పిన మాట‌ల‌ను నేను మ‌ర‌చిపోలేదు. అప్ప‌టి నుంచి సినిమా కోసం త‌ను నిల‌బ‌డ్డాడు. ఈ సినిమాకు సంబంధించిన త‌నే ఉస్తాద్. కావ్యా క‌ళ్యాణ్ రామ్ కూడా సూప‌ర్బ్‌గా న‌టించింది అన్నారు.