మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By DV
Last Modified: బుధవారం, 28 డిశెంబరు 2016 (17:57 IST)

శర్వానంద్-దిల్ రాజుల 'శతమానం భవతి' సెన్సార్ పూర్తి

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా పేరున్న దిల్ రాజు నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వ

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా పేరున్న దిల్ రాజు నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో పూర్తి అయ్యింది. కుటుంబ కథా నేపధ్యంలో సాగే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ U సర్టిఫికెట్ లభించింది. 
 
"శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది. సంక్రాంతికి కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రం మా శతమానం భవతి. ఇది శర్వానంద్ 25వ చిత్రం కావటం విశేషం. మిక్కీ అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది. బొమ్మరిల్లు సినిమా మా సంస్థకి ఎంత పేరు తెచ్చిందో, ఈ చిత్రం కూడా అంతే పేరుని తెస్తుంది అన్న నమ్మకం ఉంది", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.