1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
  4. Jamba Lakidi Pamba Official Teaser

'నాకేమైనా మావిడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి' .. 'జంబలకిడి పంబ' టీజర్

హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమై, కథానాయకుడిగా అలరిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నటించిన తాజా చిత్రం 'జంబలకిడిపంబ'. సిద్ధి ఇద్నానీ కథానాయిక. జేబీ మురళీ కృష్ణ(మను) దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణజరుపుకొంటున్న

Jamba Lakidi Pamba Official Teaser
హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమై, కథానాయకుడిగా అలరిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నటించిన తాజా చిత్రం 'జంబలకిడిపంబ'. సిద్ధి ఇద్నానీ కథానాయిక. జేబీ మురళీ కృష్ణ(మను) దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణజరుపుకొంటున్న ఈ చిత్ర టీజర్‌ను గురువారం యువ కథానాయకుడు నాని విడుదల చేశారు.
 
నిజానికి గతంలో ఇదే పేరుతో ఓ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి దివంగత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎంతో ప్రజాధారణ పొందింది. బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను కితకితలు పెట్టి గుక్క తిప్పుకోనీయకుండా నవ్వించేసింది. ఆ సినిమాకు సంబంధించి టెలివిజన్‌లో ఒక్క సీన్‌ వచ్చినా చాలు ఇప్పటికీ పడిపడి నవ్వేస్తారు. ఇప్పుడు ఇదే పేరుతో శ్రీనివాస్ రెడ్డి హీరోగా వస్తున్న చిత్రమే ఈ 'జంబలకిడి పంబ'. 
 
'నాకు విడాకులు కావాలి సర్' అంటూ కథానాయిక అంటే, 'నాకేమైనా మావిడాకాలు కావాలా? నాకు విడాకులే కావాలి' అంటూ శ్రీనివాస్‌రెడ్డి వేసే పంచ్‌ కితకితలు పెడుతుంది. ఇక టీజర్‌లోని పాత్రలు, వారు పలుకుతున్న సంభాషణలు చూస్తుంటే సినిమాను ఆద్యంతం నవ్వులు పంచేలా కట్ చేశారు. 
 
గోపీ సుందర్‌ సంగీత బాణీలు సమకూర్చగా, శివమ్‌ సెల్యులాయిడ్‌, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రవి, జోజో జోస్‌, ఎన్‌.శ్రీనివాసరెడ్డి, బి. సురేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, షకలక శంకర్‌, సత్యం రాజేశ్‌, ధనరాజ్‌, ప్రకాష్‌రెడ్డి, హరితేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్ర‌భాస్ ‘సాహో’ బ‌డ్జెట్ పెరుగుతోంది ఎంతో తెలిస్తే షాకే..!