1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Labh Pancham 2026: Date, Puja Muhurat And Significance

కార్తీక శుక్ల పంచమి.. లక్ష్మీ పంచమి, లాభ పంచమి రోజున కొత్త వ్యాపారాలు చేస్తే?

Labh Pancham 2026
Labh Pancham 2026
కార్తీక శుక్ల పంచమి రోజు జ్ఞాన పంచమి, నాగపంచమిగా పరిగణిస్తారు. 2026లో కార్తీక శుక్ల పంచమి నవంబర్ 14, 2026 శనివారం నాడు వస్తుంది. ఈ రోజున ఆలయాలు, ఇళ్లలో దీపాలు (దీపం) వెలిగించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. 
 
ఈ శనివారం నాడు శివుడు, విష్ణువు, శని దేవునికి పూజలు చేయడం ఉత్తమం. కార్తీక మాసంలో వెలిగించే దీపం, చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వీలైనంత వరకు ప్రతిరోజూ దీపారాధన చేయడం, తులసీ పూజ, శివాభిషేకం, విష్ణు ఆరాధన, ఉపవాసం, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని భక్తుల విశ్వాసం. 
 
ఈ రోజున దేవాలయాల సందర్శన, ఉపవాసం, శక్తి కొద్దీ దానాలు చేయడం మంచిదని సంప్రదాయం. ఇదే కార్తీక శుక్ల పంచమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన జ్ఞానవృద్ధి కలుగుతుందని, అలాగే కొన్ని ప్రాంతాల్లో గణేశుడు - లక్ష్మీదేవిని పూజించి వ్యాపార లాభాల కోసం లాభ పంచమిగా జరుపుకుంటారు. 
 
అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి భక్తులు ఈ రోజున ఉపవాసాలు, పూజలు ఆచరిస్తారు. కార్తీక శుక్ల పంచమిని జైన సంప్రదాయంలో జ్ఞాన పంచమిగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇదే రోజును కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ పంచమి, లాభ పంచమి (లేదా సౌభాగ్య పంచమి) గా కూడా పాటిస్తారు. 
 
లాభం అంటే సంపాదన, పురోగతి అని అర్థం. దీపావళి వేడుకల అనంతరం కొత్త పనులు, వ్యాపారాలను ప్రారంభించడానికి ఈ రోజును శుభప్రదంగా భావిస్తారు. గణేశుడిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, సంపద, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల్లో అభివృద్ధి సాధించాలని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
14-11-2026 - శనివారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి