సంబంధిత వార్తలు
- చిరంజీవి, రాంచరణ్‌లకు కోపం తెప్పించిన నయతార... ఎందుకు?
- మెగాస్టార్ - కొరటాల మూవీ తాజా వార్త... చెర్రీ నటిస్తున్నాడట...
- దర్శకుల సంక్షేమం కోసం ట్రస్ట్... జక్కన్న రూ.50 లక్షలు, చిరంజీవి రూ. 25 లక్షలు
- చిరుకు కండీషన్స్ పెట్టిన కొరటాల. ఇంతకీ ఏంటా కండీషన్స్..?
- ఏరువాక పౌర్ణమి... హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు
అంతగా అడుగుతున్నారుగా... సర్లే వస్తానన్న నయనతార... ఎవరు? ఎక్కడికి?
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి ప్రి-రిలీజ్ ఈవెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంటుకి చిరు సరసన నటించిన నయనతారను కూడా రమ్మన్నారట. దీనికి తొలుత నయన్ నో చెప్పిందట.
ఆ తర్వాత ఆమె ఎక్కడికెళ్లినా చిరు ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఈవెంటుకు వస్తారా రారా అంటూ రిక్వెస్టులు మీద రిక్వెస్టులు చేస్తున్నారట. చిరు ఫ్యాన్స్ అంతగా అడుగుతుంటే నయనతార కదిలిపోయిందట. సర్లే నేను వెళ్తాను అని చెప్పిందట.
మరోవైపు సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మారింది. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సంచలన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి మెగాభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అక్టోబర్-02న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుండటంతో.. ప్రి రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మొదట కర్నూలులో నిర్వహించాలి అనుకున్నారు కానీ... అనివార్య కారణాల వల్ల హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా వేడుకలు జరగనున్నాయని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే 18 నుంచి 22కు వాయిదా పడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అఖిలభారత చిరంజీవి యువత ఓ ప్రకటనలో తెలిపింది.
కానీ దర్శకనిర్మాతలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాగా.. ఈ మెగా వేడుకకు ప్రత్యేక అతిథులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శధీరుడు రాజమౌళి, శివ కొరటాల, వీవీ వినాయక్ విచ్చేస్తారని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మార్చారు కానీ.. ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది మాత్రం తెలియలేదు.
