ద‌ర్శ‌కుల సంక్షేమం కోసం ట్ర‌స్ట్... జక్కన్న రూ.50 లక్షలు, చిరంజీవి రూ. 25 లక్షలు

rajamouli
శ్రీ| Last Modified శుక్రవారం, 26 జులై 2019 (17:34 IST)
తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం మే4 వ తేదీన దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్ర రావు తెలుగు చలన చిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేసుకుందాం అని తీర్మానించారు. తద్వారా సంఘంలోని సభ్యులలో ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నవారికి ఆరోగ్య, విద్య మరియు కుటుంబ అవసరాలకి సహాయం చేసే విధంగా ఒక నిధిని ఏర్పాటు చేసుకుని, తద్వారా వచ్చే వడ్డీతో అర్హులైన వారికి తోడ్పాటు ఇద్దాం అని చెప్పారు. ముందుగా దర్శకులు శ్రీ రాజమౌళి 50 లక్షలు భారీ విరాళం అందించారు.

శ్రీ రాఘవేంద్ర రావు 10 లక్షలు, ఆర్కా మీడియా వారు 15 లక్షలు విరాళం ప్రకటించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు ట్రస్ట్ ఆలోచనని మెచ్చి, పెద్ద హృదయంతో 25 లక్షలు ప్రకటించారు. ప్రస్తుత దర్శకుల సంఘ ప్యానెల్ సత్సంకల్పం, మిగతా అందరి దర్శకుల సహాయ, సహకారాలతో 24/7/2019 ట్రస్ట్‌ని రిజిస్టర్ చేయడం జరిగింది.

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ పేరిట శ్రీ రాఘవేంద్ర రావు చైర్మన్‌గా, శ్రీ N శంకర్ (మేనేజింగ్ ట్రస్టీ), శ్రీ వి వి వినాయక్ శ్రీ సుకుమార్, శ్రీ బోయపాటి శ్రీను, శ్రీ సురేందర్ రెడ్డి, శ్రీ హరీష్ శంకర్, శ్రీ వంశీ పైడిపల్లి, శ్రీ మెహెర్ రమేష్ (ట్రెజ‌ర‌ర్) శ్రీ కొరటాల శివ, శ్రీ నందిని రెడ్డి, శ్రీ రాంప్ర‌సాద్‌, శ్రీ కాశీ, శ్రీ బి.వి.ఎస్‌.ర‌వి ట్రస్టీలుగా ఆవిర్భావం జరిగింది.

విరాళాల సేకరణ, సహాయ నిధిని త్రికరణశుద్ధిగా సభ్యుల అత్యవసర అవసరాలకి అందించే విధంగా TFDTని ముందుకు తీసుకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. TFDAకి మరింత మెరుగైన భవనం, లైబ్రరీ, ఫంక్షన్ హాల్, దర్సకత్వ శాఖలో ప్రావీణ్య తరగతులు, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుకుంటుంది. ఈ సందర్భంగా శ్రీ KTR గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.దీనిపై మరింత చదవండి :