చిరు రికార్డ్‌ను మ‌హేష్ బాబు బ్రేక్ చేయ‌నున్నాడా..? ఇంత‌కీ ఏంటా రికార్డ్..?

Mahesh Babu
శ్రీ| Last Modified బుధవారం, 12 జూన్ 2019 (12:08 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సంచ‌ల‌న చిత్రం మ‌హ‌ర్షి. ఇది మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డం విశేషం. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ ఈ ముగ్గురు క‌లిసి ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న‌ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ.. మ‌హ‌ర్షి చిత్రం త‌ర్వాత భారీ చిత్రాలు రిలీజ్ కాక‌పోవ‌డం.. వ‌చ్చిన సినిమాలు ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో మ‌హ‌ర్షి చిత్రం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

మ‌హ‌ర్షి 100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు 101 కోట్లు షేర్ క‌లెక్ట్ చేసింద‌ని తెలిసింది. టాలీవుడ్లో 100 కోట్ల క్ల‌బ్‌లో బాహుబ‌లి 2, బాహుబ‌లి, రంగ‌స్థ‌లం, ఖైదీ నెం 150.. ఇప్పుడు మ‌హ‌ర్షి చేరాయి. అయితే... ఖైదీ నెం 150 చిత్రం 102 కోట్లు షేర్ వ‌సూలు చేసింది. మ‌హ‌ర్షి చిత్రం త్వ‌ర‌లో ఖైదీ నెం 150 క‌లెక్ట్ చేసిన 102 కోట్ల‌ షేర్‌ను క్రాస్ చేసే ఛాన్స్ ఉంద‌ని సినీ పండితులు చెబుతున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే చిరంజీవి రికార్డ్‌ను మ‌హ‌ష్ బ్రేక్ చేసిన‌ట్టే.దీనిపై మరింత చదవండి :