లండన్‌ల "మహర్షి" సందడి.. గౌతమ్‌తో సెల్ఫీ
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, 14వ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతోది. ఈ మ్యాచ్‌కు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాడు. ముఖ్యంగా, తన కుమారుడు గౌతమ్‌తో కలిసి మైదానంలోకి అడుగుపెట్టిన మహేష్.. ఓ సెల్ఫీ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మహర్షి చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ విహార యాత్రలో ఉన్నారు. అయితే, ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగ వీక్షించాలని గౌతమ్ పట్టుబట్టడంతో మహేష్ బాబు తలొగ్గక తప్పలేదు. దీంతో నెల రోజులకు ముందుగానే ఈ మ్యాచ్ కోసం మహేష్ టిక్కెట్లు బుక్ చేశారు.
దీంతో లండన్‌కు చేరుకున్న మహేష్ ఫ్యామిలీ ఆదివారం ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌కు హాజరయ్యారు. స్టేడియంలో తన కుమారుడు గౌతమ్‌తో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మ్యాచ్‌ను హాయిగా ఆస్వాదిస్తూ ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. మా అబ్బాయి కోసం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వచ్చానంటూ మహేశ్ తన సెల్ఫీకి క్యాప్షన్ పెట్టాడు. దీన్ని మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.