శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (15:12 IST)

వరల్డ్ కప్ : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. కోహ్లీ సేన బ్యాటింగ్

ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్‌లో భాగంగా, ఆదివారం లండన్ వేదికగా ఓవల్ మైదానంలో  ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిగా, భారత్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో విజయభేరీ మోగించింది. భారత ఓపెనర్లుగా రోహిత్ - ధవాన్‌లు బ్యాటింగ్ మొదలుపెట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు 2 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా ఏడు పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత్ : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కేఎం జాదవ్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్ప్రీత్ బూమ్రా. 
 
ఆస్ట్రేలియా జట్టు : వార్నర్, ఫించ్, ఖవాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టోయిన్స్, కేరీ, కౌల్టర్ నైల్, కుమ్మిన్స్, స్ట్రాక్, జంపా.