సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 16 మే 2019 (20:52 IST)

మెగాస్టార్ సైరా సినిమాలో అనుష్క‌. ఇంత‌కీ ఆమె పాత్ర ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న‌లేటెస్ట్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, కిచ్చ సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.
 
ఈ మూవీలో అనుష్క న‌టిస్తే బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ ఎప్ప‌టి నుంచో ఆమెని కాంటాక్ట్ చేస్తునే ఉంద‌ట‌. కానీ... ఆమె ఏమనుకుందో ఏమో కానీ చాలా రోజుల వ‌ర‌కు స్పందించ‌లేద‌ట‌. క‌ట్ చేస్తే.. ఏమ‌నుకుందో ఏమో కానీ.. ఇటీవ‌ల ట‌చ్ లోకి వ‌చ్చి సైరాలో న‌టించేందుకు ఓకే చెప్పింద‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌లో అనుష్క పాల్గొంటుంద‌ని స‌మాచారం. ఇంత‌కీ ఈ చిత్రంలో అనుష్క పాత్ర ఏంటి..? అంద‌రిలో ఇదే డౌట్..? 
 
అనుష్క పాత్ర ఏంటంటే... ఇది 19వ శ‌తాబ్దానికి చెందిన కథ కావ‌డంతో డైరెక్ట్‌గా క‌థ‌లోకి వెళ్ల‌కుండా అన్ని భాష‌ల వారికి తెలిసిన వారు క‌థ చెబితే బాగుంటుంది అనుకున్నార‌ట‌. బాహుబలి సినిమాతో అనుష్క దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవ‌డంతో ఆమెతో సైరా క‌థ చెప్పించ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం అనుష్కపై ఈ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 2న‌ ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సైరా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో..?