మెగాస్టార్ సినిమా చరిత్ర సృష్టిస్తుంది తనికెళ్ళ భరణి..

tanikella bharani
జె| Last Modified సోమవారం, 10 జూన్ 2019 (20:05 IST)
సైరా సినిమాపై అభిమానుల అంచనాలు అంతాఇంతా కాదు. చిరంజీవి నటించిన 151 సినిమా ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

అభిమానుల అంచనాలను మించి సినిమా ఉంటుందంటున్నారు తనికెళ్ళ భరణి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తనికెళ్ళ భరణి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. చిరంజీవి నటించిన సైరా సినిమా ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుంది. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచుతుంది.

సినిమా ఆలస్యమైందని అభిమానులు బాధపడకండి. కష్టపడిన దానికి ఫలితం దక్కుతుందన్న సామెత ఉంది కదా అది ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. సైరా సినిమాలో కొత్త క్యారెక్టర్ నాకు రావడం సంతోషంగా ఉంది. నన్ను తెలుగు ప్రేక్షకులు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను దర్సకుడిగా ఆగష్టులో ఒక సినిమాను ప్రారంభిస్తున్నాను.. ఆ సినిమా షూటింగ్ బాగా జరిగి సక్సెస్ కావాలని శ్రీవారిని ప్రార్థించడానికి తిరుమల వచ్చానంటున్నారు తనికెళ్ళ భరణి.దీనిపై మరింత చదవండి :