బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (15:22 IST)

చిరంజీవి సరసన శృతిహాసన్.. చెర్రీ సరసన శృతి.. సినిమా పేరెంటి?

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె, శృతిహాసన్ కీలకమైన పాత్రలో కనిపించి సందడి చేయనున్నట్టు టాక్. ఈ విషయమై శృతిని కూడా మేకర్స్ సంప్రదించినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది. శృతి మాత్రం తన నిర్ణయాన్ని త్వరలోనే చెబుతానని అన్నట్లు కోలీవుడ్ టాక్. పెద్దగా ప్రాజెక్టులు చేయని శృతి.. వీలైనంత సమయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కి కేటాయిస్తుందని సమాచారం.
 
కానీ పెద్ద హీరోల సరసన నటించడం వస్తే ఈ ప్రాజెక్టులో చేసేది లేదని శృతి సన్నిహితులతో చెప్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ మెగా యంగ్ హీరోలు పవన్, అల్లుఅర్జున్, చెర్రీల పక్కన హీరోయిన్‌గా శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నయనతార మెయిన్ హీరోయిన్‌గా కనిపిస్తుందని.. శృతి సెకండ్ హీరోయిన్‌ రోల్ పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
అంతేగాకుండా కొణిదెల కంపెనీ కింద నిర్మితమయ్యే ఈ సినిమా మల్టీస్టారర్ అని.. ఇందులో చెర్రీ కూడా హీరోగా కనిపిస్తాడని.. అతని సరసనే శృతి కనిపించనుందని కూడా టాక్ వస్తోంది. ఏది నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే దాకా ఆగాల్సిందే.