గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (14:58 IST)

'సైరా' తర్వాత ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు ఓకె చెప్పిన మెగాస్టార్

దాదాపు దశాబ్దకాలం తర్వాత సినీరంగ ప్రవేశం చేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్రియాశీలక రాజకీయాల తర్వాత చేసిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ప్రస్తుతం 'సైరా' నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మరో రెండు నెలల్లో పూర్తికానుంది. వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో చిరంజీవి మరో రెండు చిత్రాల్లో నటించనున్నారు. అందులో ఒకటి కొరటాల శివ, రెండోది మాటలమాంత్రికుడు త్రివిక్రమ్. ఇవి 152, 153 చిత్రాలుగా రూపుదిద్దుకోనున్నాయి. ముఖ్యంగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం సందేశాత్మక చిత్రంగా ఉండనుంది. అలాగే, డీవీవీ దానయ్య నిర్మాత, చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.
 
ఈ రెండు చిత్రాల్లో తొలుత కొరటాల శివ దర్శకత్వంలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాత సినిమా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుందని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తాజాగా వెల్లడించారు. నిజానికి 'మిర్చి' చిత్రం తర్వాత కొరటాల శివతో చెర్రీ ఓ మూవీని తీయాలని భావిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు సాధ్యపడలేదు. కానీ, చిరంజీవితో మాత్రం కుదిరింది.