గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (16:14 IST)

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతుల పిచ్చి పనులు..

Youth dance in metro
Youth dance in metro
పిచ్చి వేషాలకు ఢిల్లీ మెట్రోను కేరాఫ్‌గా మార్చుకుంటున్నారు కొందరు. తాజాగా ఇలాంటి ఓ వింత ఘటన నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు మెట్రోలో రచ్చ రచ్చ చేశారు. 
 
ఇద్దరు అమ్మాయిలు మెట్రోలో హోలీ ఆడారు. అయితే అదేదో సరదాగా ఉంటే బాగుండేది కానీ అసభ్యకరంగా వ్యవహరించారు. నడుస్తున్న మెట్రోలో ఒకరిపై ఒకరు రంగులు పూస్తూ డ్యాన్స్‌ చేశారు. ఓ రొమాంటిక్‌ సాంగ్‌కు అనుగుణంగా హావభావాలు పలికించారు. 
 
అందరి ముందు అభ్యంతరరంగా ప్రవర్తించడంతో ఇతర ప్రయాణికులు సైతం ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.