కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. దక్షిణాది రాష్ట్రంలో సత్తా చాటి జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్టను పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. మరో కీలక పార్టీ...