గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

నేడు గుజరాత్ తుదిదశ పోలింగ్.. 93 స్థానాల్లో పోలింగ్

voterswomen
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం రెండో దశ పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇది సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
 
ముఖ్యంగా, అహ్మదాబాద్, వడోదర, గాంధీ నగర్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న 93 నియోజకవర్గాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ దశలో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో సహా మొతత్ం 61 రాజకీయ పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, ఆప్ పార్టీలు 93 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 90 సీట్లలో పోటీ చేస్తుంది. 
 
ఈ దశలో మొత్తం 1.29 కోట్ల మంది పురుషులు, 1.22 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 2.51 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 14,975 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 1.13 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 18 నుంచి 19 యేళ్లలోపు 5.96 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.