శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (12:52 IST)

బిగ్ బాస్ సీజన్-6: 11మంది ఎలిమినేషన్ అయ్యారు..

BB6
BB6
బిగ్ బాస్ హౌస్‌లో 21మంది సభ్యులతో మొదలైన ఈ షోలో 11మంది ఎలిమినేషన్ అయ్యారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. బాలాదిత్య అనూహ్యంగా ఎలిమినేట్ కాగా, నిన్న ఆదివారం ఉత్కంఠ మధ్య వాసంతి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.
 
వాసంతి సైతం తన ఎలిమినేషన్‌ని ఒప్పుకుంది. కాస్త ఎమోషనల్ అయినా.. నవ్వుతూనే హౌస్‌ను వీడింది. వాసంతి నిష్క్రమణతో హౌస్‌లో ఆదిరెడ్డి, రేవంత్, ఫైమా, రాజ్, కీర్తి, మెరీనా, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయా మిగిలారు.
 
వీరికి టైటిల్ కోసం పోటీపడేందుకు నాగార్జున క్యాష్ ప్రైజ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేశాడు. గెలిచిన కంటెస్టెంట్ రూ. 50 లక్షలు గెలుచుకుంటాడని ఆశ కలిగించారు. దీంతో టైటల్ కోసం పోరుకు టాప్-10 కంటిస్టెంట్లు రెడీ అయ్యారు.