గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (20:47 IST)

బిగ్ బాస్ రియాల్టీ షోకు టీఆర్పీ రేటింగ్ తగ్గిపోతుందా?

Bigg boss
బిగ్ బాస్ రియాల్టీ షోకు టీఆర్పీ రేటింగ్ తగ్గిపోతోంది. ఈ షోలో సస్పెన్స్ లేకపోవడం.. హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతున్నారనే విషయం ముందుగానే తెలిసిపోవడం.. కూడా ఈ షోపై ఆసక్తిని సన్నగిల్లేలా చేస్తోందని చెప్తున్నారు సినీ పండితులు. ఈ సీజన్‌లో పేరున్న సెలబ్రిటీలు ఎవరూ లేరు. 
 
దీంతో ఈ రియాల్టీ షో గ్లామర్‌ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఈ షో రేటింగ్స్ దారుణంగా ఉన్నాయి. మరోవైపు, క్రికెట్ మ్యాచ్ ఉంటున్న రోజుల్లో షో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 
 
బిగ్ బాస్ తొలి వారం టీఆర్పీ రేట్లను మనం చూసినట్టయితే విషయం అర్థమవుతుంది. సీజన్ 1 - 16.18 టీఆర్పీ రేటింగ్, సీజన్ 2 - 15.05, సీజన్ 3 - 17.90, సీజన్ 4 - 18.50, సీజన్ 5 - 15.70, సీజన్ 6 - 8.86 గా ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.