బిగ్ బాస్ రియాల్టీ షోను ఆపేస్తున్నారా? బిగ్‌బాస్‌లో అశ్లీలతపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు
బిగ్ బాస్ రియాల్టీ షోపై నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ స్థాయిలో ఈషోని ఆపేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే "బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్" (ఐబీఎఫ్) గైడ్‌లైన్స్‌కి లోబడే ప్రసారాలు ఉండటంతో ఇప్పటివరకూ బిగ్ బాస్ ఆగింది లేదు.
ప్రస్తుతం బిగ్ బాస్ షోపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ షోలో అశ్లీలత, అసభ్యత ఎక్కువైందని.. ఫ్యామిలీతో కలిసి చూడాలంటే ఇబ్బందికరంగా ఉందంటూ ఈ షోని నిషేదించాలని ఏపీ హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
బిగ్ బాస్ షో ఆపేయాలంటూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐబీఎఫ్ గైడ్ లైన్స్‌ను బిగ్‌బాస్ షో నిర్వాహకులు పాటించలేదని వెంటనే షోను ఆపేయాల్సిందిగా అభ్యర్థించారు పిటిషనర్.
బిగ్‌బాస్‌లో అశ్లీలతపై కోర్టు ఘాటుగా స్పందించింది. 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయం తీసుకుంటామని.. విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది హైకోర్టు.