బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 మే 2023 (22:42 IST)

మీ వాట్సాప్ నంబరుకు విదేశీ కాల్స్ వస్తున్నాయా? అటెండ్ చేశారో అంతే సంగతులు...

whatsapp call
సైబర్ నేరగాళ్లు అనుక్షణం కొత్త టెక్నాలజీతో మోసాలకు పాల్పడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకుంటే మాత్రం మన బ్యాంకు బ్యాలెన్స్ సున్నా కావడం తథ్యం. ముఖ్యంగా, వాట్సాప్ నంబరుకు వివిధ దేశాల నుంచి వాట్సాప్ కాల్స్ చేస్తూ, వాటిని అటెండ్ చేసే మొబైల్ యూజర్ల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును క్షణాల్లో లాగేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఇథియోపియా (+251), మలేషియా (+60), ఇండోనేషియా (+62), కెన్యా (+254), వియత్నాం (+84) తదితర నంబర్లతో మొదలయ్యే కాల్ వస్తే మాత్రం జాగ్రత్త పడాల్సిందేనని టెక్ నిపుణులతోపాటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ ఫోన్లన్నీ విదేశాల నుంచి వచ్చినట్టు కనిపించినా.. నిజానికి ఇవి మన దేశం నుంచి వచ్చే ఫోన్లే. 
 
కొన్ని సార్లు అవి మీరు ఉంటున్న నగరం నుంచే వచ్చే అవకాశం లేకపోలేదు. విదేశీ నంబర్ల సాయంతో వాట్సాప్ కాల్ చేస్తూ సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల మొబైల్ ఫోన్లకు వచ్చే వాట్సాప్ కాల్స్‌పై మరింత అప్రమత్తతో జాగ్రత్తతో వ్యహరించాలని సూచిస్తున్నారు.