శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (17:32 IST)

కోవిడ్ సోకితే ఏమౌతుంది.. బెడ్‌పైనే సీఏ పుస్తకాలు.. సీఏ స్టూడెంట్ అదుర్స్

covid patient
కోవిడ్ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అయినా జనం పొట్ట కూటి కోసం నానా తంటాలు పడుతూ చేతికి అందిన ఉపాధి చూసుకుంటున్నారు. అయితే కరోనాకు గురై హాస్పిటల్‌లో చేరిన ఓ వ్యక్తి అక్కడే సీఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ వ్యక్తికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కోవిడ్-19 యొక్క రెండవ వేవ్ కింద భారతదేశంలో విజృంభిస్తున్న వేళ, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలు ఉన్నప్పటికీ వారి పరీక్షల సన్నాహాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఒక చిత్రం వైరల్ అవుతోంది. ఇక్కడ అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ, కోవిడ్‌తో యుద్ధం చేస్తూ ఒక విద్యార్థి ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చేరినా చదువు పట్ల అతని డెడికేషన్‌లో తేడా రాలేదు. తన చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ) పరీక్ష కోసం చదువుతూనే ఉన్నాడు.
 
ఒడిశాలోని ఓ హస్పిటల్‌లో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్క్, కళ్లద్దాలు పెట్టుకుని హస్పిటల్ బెడ్ పైనే చదువుకుంటున్న అతని ఫొటోను ఐఏఎస్ అధికారి విజయ్ కులంగే సోషల్ మీడియాలో షేర్ చేశారు.
 
బెర్హామ్‌పూర్‌లోని ఎమ్‌కేసీజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తనిఖీకి వెళ్లినపుడు ఈ వ్యక్తి కనిపించాడని విజయ్ తెలిపారు. అతని ఫొటోను పోస్ట్ చేస్తూ.. `విజయం అనేది యాదృశ్చికం కాదు. ఎంతో అంకితభావం కావాలి. నీ అంకిత భావం నీ బాధను మరిపింపచేస్తుంది. విజయాన్ని దరిచేస్తుంద`ని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.