శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (11:44 IST)

భార్యాపిల్లలు పక్కనే వున్నారు.. అయినా మహిళా వెయిటర్‌ని తాకరాని చోట..?

మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, దురాగతాలు, వేధింపులు అధికమవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక మహిళా వెయిటర్‌కు ఎదురైన వేధింపులకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన విదేశాల్లో

మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, దురాగతాలు, వేధింపులు అధికమవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక మహిళా వెయిటర్‌కు ఎదురైన వేధింపులకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన విదేశాల్లో ఎక్కడ చోటుచేసుకుందో తెలియరాలేదు కానీ.. మహిళా వెయిటర్‌పై ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన వ్యక్తి వేధించాడు. దారుణం ఏంటంటే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ వ్యక్తి భార్యాపిల్లలు అక్కడే ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఒక ఓపెన్ రెస్టారెంట్‌లోకి వచ్చిన ఒక వ్యక్తి అక్కడున్న మహిళా వెయిటర్‌ను వెనక తాకాడు. దీంతో ఆమె అతనికి తగిన బుద్ధిచెప్పింది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం ఒక మహిళా వెయిటర్ తన పనిలో మునిగివుండగా, వెనుకనుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆమె వెంటనే అతని కాలర్ పట్టుకుని పక్కకు నెట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దీని ప్రకారం జూన్ 30న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా సదరు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. కాగా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా వెయిటర్‌ను వేధించిన వ్యక్తిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.