కొబ్బరి పాల అన్నం
కొబ్బరిని వేయించి, అందులో అన్నం వేసి కలబెట్టి కొబ్బరి అన్నం చేయడం చాలా సులభమే అయితే కొబ్బరి పాలలోనే అన్నం ఉడకబెట్టి చేసే కొబ్బరి పాల అన్నం ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ వదిలేందుకు మనసు రాదు.
కావాల్సిన పదార్థాలుః
కొబ్బరికాయ - 1
పచ్చిబియ్యం- ఓ గ్లాసెడు
వనస్పతి- ఓ చిన్న గరిటె
నెయ్యి- ఓ చిన్న గరిటె
అల్లం, వెల్లుల్లి- కొద్దిగా.
గరం మసాలా- కొద్దిగా.
పుదీనా, కొత్తి మీర- కొద్దిగా
ఉప్పు- తగినంత
తయారీ విధానం:
మొదట కొబ్బరిని తురిమి దానిని బాగా రుబ్బి నీళ్లు కలపడం ద్వారా కొబ్బరి పాలు సేకరించాలి. బియ్యం కడిగి, నీళ్లను తీసేసి, అందులో కొద్దిగా వంటనూనె వేసి నానబెట్టండి.
స్టవ్‌పై బాణలి పెట్టి డాల్డా వేసి, గరం మసాలాను వేయించండి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తమీరి రెబ్బలను కూడా వేయండి. తర్వాత కొబ్బరి పాలను పోసి, అవసరమైనంత మేర ఉప్పువేసి, మూత పెట్టండి.
పాలు బాగా కాగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా కలబెట్టండి. కుక్కర్ అయితే రెండు విజిళ్లు వచ్చిన వెంటనే దించేయండి. పాత్రలో అయితే పది నిమిషాల పాటు అలాగే మూత వేసి ఉంచాలి.
పై మూత తీసిన వెంటనే దానిపై నెయ్యి వేసి, అన్నం చెదరకుండా కలబెట్టాలి. రుచికోసం చివరగా మిగిలిన నెయ్యిలో కొన్ని జీడిపప్పులను వేయించి అందులో వేయాలి. దీనితో పాటు ఆలూ చిప్స్‌ను సైడ్ డిష్‌గా చేసుకుంటే చక్కగా ఉంటుంది.