1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

నువ్వుల పూర్ణం

నువ్వులు గంట సేపు నానిన నువ్వులు బెల్లం
కావలసిన పదార్ధాలు :
నువ్వులు- 80 గ్రా, బెల్లం -100 గ్రా., ఏలక్కాయలు- 7, మైదా పిండి.

తయారీ విధానం :
నువ్వులు కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. నానిన నువ్వులను ఆరబెట్టిన తర్వాత బెల్లం, ఏలకుల పొడితో కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ పిండిని చిన్నచిన్న వుండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండిని జారుడుగా కలుపుకోవాలి. ముందు తయారుచేసుకున్న నువ్వు వుండలను ఈ పిండిలో ముంచి నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇలా తయారైన నువ్వు పూర్ణాలను నువ్వులతోనూ, కొబ్బరి కోరుతోనూ అలంకరించి సర్వ్ చేసుకోవచ్చు.