పాలకూర వేపుడు
కావలసిన పదార్థాలు :
పాలకూర... 4 కట్టలు
పెసరపప్పు... వంద గ్రాములు
వెల్లుల్లి... 8 రేకలు
పచ్చిమిర్చి... పది
ఉప్పు... సరిపడా
పసుపు... చిటికెడు
తాలింపు గింజలు... ఒక టీస్పూను
ఎండుమిర్చి... నాలుగు
నూనె... వంద గ్రాములు
తయారీ విధానం :
పాలకూర ఆకులను తీసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి, కాగిన తరువాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పాలకూర, కడిగి ఉంచుకున్న పెసరపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు వేసి కాసేపు వేయించాలి. సరిపడేంత నీటిని అందులో పోసి, బాణలిపై మూతపెట్టి తక్కువ మంటలో ఉడికించాలి. కూర బాగా ఉడికి, పొడి పొడిగా అయిన తరువాత కిందికి దించేయాలి. ఇది చపాతీల్లోకి సైడ్డిష్గా చాలా బాగుంటుంది.