1980స్ రెట్రో ఏఐ ఫోటో ట్రెండ్‌లో భాగమైన రేవంత్ రెడ్డి.. రెట్రో లుక్ అదుర్స్.. పాతతరం హీరోలా?
Revanth Reddy
80ల నాటి హెయిర్‌స్టైల్, అప్పటి వింటేజ్ కాస్ట్యూమ్స్‌తో అచ్చం పాతతరం సినీ హీరోను తలపించేలా రేవంత్ రెడ్డి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలతో పాటు, రాహుల్ గాంధీతో ఉన్న రెట్రో లుక్ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల రెట్రో చిత్రాలు చక్కర్లు కొడుతున్న సమయంలోనే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ట్రెండ్‌లో చేరడం రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.
