మగాళ్లతో పోల్చుకుంటే మహిళల్లోనే ఒత్తిడి ఎక్కువ...!
మగాళ్లతో పోల్చుకుంటే ఆడవాళ్లలోనే డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. భావోద్వేగాలు, ఒత్తిడి ప్రభావం పురుషులు, మహిళల్లో ఎవరిపై ఎక్కువ చూపుతుందనే అంశంపై అమెరికా, న్యూయార్క్ లోని పెన్సుల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ధియోడర్ సట్టర్థవెయిట్ పరిశోధన నిర్వహించారు. 22 ఏళ్ల వయసున్న పలువుర్ని పరిశోధనకు తీసుకున్నారు. వారి మెదడును స్కాన్ చేసి పరిశోధనలు నిర్వహించారు.
మగాళ్లతో పోల్చుకుంటే ఆడవాళ్లలోనే డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని, అందుకు ఓస్ట్రోజెన్ అనే సెక్స్ హార్మోను ప్రభావమని ఆయన తేల్చారు. మానసిక సమస్యలు తలెత్తినప్పుడు ఓస్ట్రోజెన్ అనే హార్మోను ఎక్కువ మొత్తంలో రక్తాన్ని మెదడులోకి పంప్ చేస్తుందని తెలిపారు. అందువల్ల భావోద్వేగం, ఒత్తిడి మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు నిర్ధారించారు.