నిర్జీవమైన కురుల కోసం మెంతి ప్యాక్!
నిర్జీవమైన కురుల కోసం మెంతి ప్యాక్ సూపర్‌గా పనిచేస్తుంది. వింటర్ సీజన్‌లో జుట్టు పోషణకు మెంతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీటితో సహా మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించాలి. ఇది బాగా తడి ఆరిన తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేస్తే వ్యత్యాసం మీకే తెలుస్తుంది.
అలాగే ఒక గుడ్డులోని పచ్చసొన, రెండు చెంచాలా తేనె, రెండు చెంచాలా క్యాస్ట్రో ఆయిల్. ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా తలకు పట్టించడం వల్ల ఈ వింటర్ సీజన్‌లో హెయిర్ బ్రేకేజ్ కాకుండా అరికడుతుంది.
