జుట్టు తెల్లగా పేలిపోయినట్టు ఉందా.. అయితే ఇలా చేయండి!
జుట్టు నల్లగా లేదని చాలా మంది తెగబాధపడుతుంటారు. చిన్నవారికి కూడా వెంట్రుకలు తొందరగా తెల్లబడుతుంది. ఇప్పుడున్నఆధునిక కాలంలో కొన్ని రకాల నియమాలు పాటించక పోవడంతో జుట్టు నల్లగా కాకుండా నిర్జీవంగా మారిపోయినట్టు కనిపిస్తుంది.
జుట్టు నల్లగా ఉండటం కోసం అన్నిరకాల క్రీములను వాడుతుంటాం ఇవన్ని తాత్కాలికం మాత్రమే. ఈ సమస్య పురుషుల కంటే స్త్రీలలో మరీ ఎక్కువగా కనపడుతోంది. నల్లని జుట్టు కోసం ఏ హెయిర్ డై ఎలా వాడాలో తెలియక కొందరు సతమతమవుతుంటారు. ఇలాంటి వారికోసం కొన్ని చిట్కాలు అవెంటో చూద్దామా:
అరలీటరు నీటిలో రెండు చెంచాల ఉసిరిపొడి కలపండి, నిమ్మకాయని సగంగా కోసి, ఒక ముక్కలోని రసాన్ని ఆ నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని రోజూ మీ తలకు రాసుకుని తలస్నానం చేస్తే అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
మామిడికాయ యొక్క రసాన్ని తీసుకుని తలకి పట్టిస్తే మంచి ఫలితాన్నిస్తుంది, జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యల నుంచి కూడా మంచి విముక్తి లభిస్తుంది. కరివేపాకు, గోరింటాకును బాగా ఎండబెట్టాలి. ఒక పాత్రలో టెంకాయనూనె, ఎండబెట్టిన కరివేపాకు, గోరింటాకు వేసి బాగా కాచి వడగట్టాలి. ఈ నూనెను ప్రతిరోజు తలకి పట్టిస్తే జుట్టు నల్లగా మారుతుంది.
రెండు కప్పుల పెరుగు, ఎండు ఉసిరి ఒక కప్పు, తీసుకుని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇలా వారానికి ఒక సారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది. ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్ళల్లో మరిగించాలి. ఈ మిశ్రమం ఒక కప్పువచ్చిన తరువాత ఇందులో రెండు కప్పుల గోరింటాకు పొడి, గుడ్డు తెల్ల సొన, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే నల్లని జుట్టు మీ సొంతం.