శనివారం, 21 మార్చి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By PNR
Last Modified: సోమవారం, 3 నవంబరు 2014 (15:28 IST)

ప్రసవం తర్వాత మహిళలు బరువు పెరుగుతారు ఎందుకని?

చాలా మంది మహిళలు తొలి కాన్పు తర్వాత బరువు పెరుగుతుంటారు. ఈ మార్పు చాలా మంది మహిళల్లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో వైద్య నిపుణుల వద్ద సంప్రదిస్తే.. సాధారణంగా ప్రసవం తర్వాత బిడ్డకు పాలిచ్చేందుకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం సర్వసాధారణం. ఈ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరే అవకాశం ఉంది. 
 
దీనివల్ల మహిళలు కాన్పు తర్వాత బరువు పెరుగుతుంటారు. అయితే, ఈ సమయంలో బాలింతలు తీసుకునే ఆహారం తల్లితో పాటు.. బిడ్డపై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. నెలలు గడిచేకొద్దీ ఆహారంలో మార్పులు చేసుకుని, తగిన వ్యాయామాలు చేసినట్టయితే తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.