బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (12:33 IST)

న్యూయార్క్‌ ఫ్యాషన్‌ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో మెరిశారు.

ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది థీమ్‌ ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’కు తగ్గట్లు, అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు ఫల్గుని, షేన్‌ పీకాక్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు.

దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపారు. మెట్‌ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. ఈఏడాది భారత్‌ నుంచి పాల్గొన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం. పైగా మేఘా కృష్ణారెడ్డి పారిశ్రామిక వేత్త కావ‌డంతో మ‌రింత పాపులారిటీ సంత‌రించుకుంది.