1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
  4. dr raman astrology

మీకు ఆకస్మికంగా వివాహం అవుతుంది...(కె. సాయి కుమార్ - హైదరాబాద్)

dr raman astrology
కె. సాయి కుమార్ - హైదరాబాద్: మీరు పంచమి మంగళవారం మిథునలగ్నము, కృత్తిక నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. 2015 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించి అర్చించండి. దోషాలు తొలగిపోతాయి. 2016 లేక 2017 నందు మీరు బాగుగా స్థిరపడతారు. మీకు ఆకస్మికంగా వివాహం అవుతుంది. భార్య స్థానము నందు కుజుడు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరమని గమనించండి. ఏదైనా దేవాలయంలో తెల్ల జిల్లేడు చెట్టును నాటండి శుభం కలుగుతుంది. 2008 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2026 వరకూ యోగాన్ని, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరమువు మంచి యోగాన్ని అనుభవిస్తారు. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల సర్వ దోషాలు పోతాయి.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
About Writer
Raman